భారతదేశం, మార్చి 14 -- తెలంగాణలో ఎల్పీజీపై సంక్షోభం నెలకొంది. కమర్షియల్ సిలిండర్లే కాదు.. గృహ వినియోగ సిలిండర్ల మీద జనాల్లో ఆందోళన ఉంది. ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు.. సాధారణ రోజువారీ సగటు కంటే అదనంగా 12,000 సిలిండర్లను శుక్రవారం(మార్చి 13, 2026) పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

శుక్రవారం(మార్చి 13, 2026) పంపిణీ చేసిన మొత్తం 2,37,123 ఎల్పీజీ సిలిండర్లలో.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 83,166, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) ద్వారా 88,257, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 65,700 సిలిండర్లు పంపిణీ జరిగాయి.

తెలంగాణలో ఎల్పీజీ సిలిండర్ల రోజువారీ అవసరం 2.5 లక్షలు కాగా.. ఇందులో 86 శాతం గృహావసరాలకు, మిగిలిన 14 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు.

రాష్ట్రంలో మొత్తం 1.29 కోట్ల ...