భారతదేశం, జూలై 8 -- భారత ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్‌ను (E20 పెట్రోల్) వేగంగా ప్రోత్సహిస్తుండటంతో స్టాక్ మార్కెట్లో ఒక సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ థీమ్ తెరపైకి వచ్చింది. ఆటోమొబైల్, ఈవీ, షుగర్, డిస్టిలరీస్, ఆయిల్ మార్కెటింగ్, ఎనర్జీ రంగాల్లోని కంపెనీలకు ఈ నిర్ణయం కొత్త ఊపునిస్తోంది. అయితే వాహనాల మైలేజీ తగ్గడం, పాత ఇంజన్లకు ఇథనాల్ ఇంధనం ఎంతవరకు సరిపోతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ థీమ్‌లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా లేదా అనే సందిగ్ధత ఇన్వెస్టర్లలో నెలకొంది. మ్యూచువల్ ఫండ్ల ద్వారా లభిస్తున్న అవకాశాలు, ఇందులో ఉన్న రిస్కులపై మార్కెట్ నిపుణులు కీలక విషయాలు పంచుకున్నారు.

ప్రస్తుతానికి మార్కెట్లో నేరుగా ఇథనాల్‌ రంగంపైనే ఇన్వెస్ట్ చేసే ప్రత్యేక మ్యూచువల్ ఫండ్స్ ఏవీ లేవు.

"ఇండియాలో ప్రస్తుతానికి ప్యూర్-ప్లే ఇథనాల్ మ్యూచ...