భారతదేశం, సెప్టెంబర్ 10 -- టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో సంప్రదాయం ప్రకారం పూర్వపు ఈఓ జె.శ్యామలరావు నుండి టీటీడీ ఈఓగా సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ బోర్డు సభ్య కార్యదర్శి ఎక్స్-అఫీషియోగా ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈఓ సింఘాల్‌కు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం ఈవో ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు ...