భారతదేశం, సెప్టెంబర్ 4 -- ప్రపంచంలో రకరకాల వ్యాపారాలు చూసుంటాం కానీ, కేవలం ఒంటిపై దురద గోకడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించడం ఎప్పుడైనా విన్నారా? చైనాలోని ఒక యువకుడు సరిగ్గా ఇదే ఆలోచనతో రంగంలోకి దిగి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు! దక్షిణ చైనాలోని షెన్‌జెన్ నగరానికి చెందిన 32ఏళ్ల జాంగ్ జియావోకియావో అనే యువకుడు 'సుమా' పేరుతో బ్రాండ్ ప్రారంభించి, కేవలం దురద గీకే షాపులు నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

22026 మే నెలలో బావోయాన్ జిల్లాలో తన మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన జాంగ్, దానికి వచ్చిన విశేష ఆదరణతో మరుసటి నెలలోనే ఫుటియాన్ జిల్లాలో రెండో బ్రాంచ్‌ను తెరిచాడు. ప్రస్తుతం ఈ రెండు స్టోర్ల ద్వారా నెలకు 1,00,000 యువాన్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 14,06,505) నికర ఆదాయం పొందుతున్నాడు.

ఈ సెంటర్లలో సర్వీస్ అందించే ...