భారతదేశం, జూలై 16 -- ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) జూలై 2025 సెషన్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును 2025 జూలై 31 వరకు పొడిగించింది. మొదటి దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15గా ఉండేది. ఇప్పుడు రిజిస్ర్టేషన్ కోసం జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని ఓపెన్, ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లలో ప్రవేశానికి జూలై 31 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

డిప్లొమా, బ్యాచిలర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, సర్టిఫికేట్ వంటి పలు కోర్సులకు ఆన్‌లైన్‌లో ignouadmission.samarth.edu.in దరఖాస్తు చేయవచ్చు. ఈ విశ్వవిద్యాలయం 300కు పైగా ప్రోగ్రాములకు ప్రవేశం కల్పిస్తుంది. వీటిలో 48 అండర్ గ్రాడ్యుయేట్, 75 పోస్ట్ గ్రాడ్యుయేట్, అనేక పీజీ డిప్లొమాలు, డిప్లొమాలు, పీజీ సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. ఇందులో బీ-కీపింగ్...