భారతదేశం, డిసెంబర్ 22 -- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తున్న విషయం తెలిసిందే. లక్షల మంది మహిళలకు ఈ పథకం వరంగా మారింది. ప్రస్తుతం మహిళలు బస్సులో వెళ్తుంటే కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపించి.. జీరో టికెట్ తీసుకుంటున్నారు. అయితే ఈ విధానానికి ఆర్టీసీ గుడ్‌బై చెప్పనుంది. ఇకపై స్మార్ట్ కార్డులను చూపిస్తే సరిపోతుంది.

మహిళలకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో కోసం సెంటర్ ఫర్ గుడ్‌ గవర్నెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అతి త్వరలో మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దీంతో ప్రయాణం ఈజీ కానుంది.

ఆధార్ కార్డు కారణంగా చాలాసార్లు కండక్టర్, మహిళల మద్య వాగ్వాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొందరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడంతో ...