భారతదేశం, ఆగస్టు 18 -- మహరాష్ట్రలోని ముంబయిలో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా విమాన, రోడ్డు ప్రయాణాలకు అంతరాయం కలిగింది. దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహరాష్ట్ర, ముంబయిలోని పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సరిగా కనిపించకపోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాన్ని దారి మళ్లించారు. ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకోవడానికి అదనపు సమయం కేటాయించాలని కోరుతూ విమానయాన సంస్థలు సలహాలు జారీ చేశాయి.

భారీ వర్షాల కారణంగా ముంబైతో సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. నిరంతర వర్షాల కారణంగా అనేక ప్రాంతాల రోడ్లు మునిగిపోయాయి. జలమయం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంధేరి సబ్వే మూసివేశారు. విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేప...