భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఇంద్రకీలాద్రిలో అమ్మవారి ప్రసాదం నేతి లడ్డూలు ఎన్ని లక్షలు చేసినా అయిపోతూనే ఉంటాయి. భక్తుల అంత ఇష్టం మరి. దీంతో దసరా శరన్నవరాత్రి సందర్భంగా లడ్డూ ప్రసాదాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఇంద్రకీలాద్రి కొండపై దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో లడ్డూలను తయారు చేస్తున్నారు. 36 లక్షల లడ్డూలు రెడీ అవుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రసాదాల పోటు భవనంలో లడ్డూలు తయారవుతున్నాయి. ఇందుకోసం అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు.

ప్రసాద తయారీ కేంద్రాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. దసరా మహోత్సవాలకు భక్తుల కోసం 36 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు. ఆలయ పరిపాలనా విభాగం అత్యున్నత నాణ్యత గల ప్రసాదాలను అందిస్తుంది. వీటిలో నాణ్యమైన శనగపిండి, చక్కెర, నెయ్యి, ఎం...