భారతదేశం, నవంబర్ 19 -- సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్యమ‌వుతుంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎక‌రాకు సాగు నీరు అందించాల‌నేదే త‌మ ల‌క్ష్యమన్నారు. వ్యవ‌సాయ రంగంలో బ‌హుముఖ సేవ‌లు అందించిన ప్రముఖుల‌కు ఇందిరా గాంధీ కృషి ర‌త్న పుర‌స్కారాల‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త‌న నివాసంలో అంద‌జేశారు.

వ్యవ‌సాయ రంగానికి సేవ‌లు అందించిన శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, రైతుల‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవ‌సాయ‌, రైతు సంక్షేమ క‌మిషన్ ఈ అవార్డుల‌కు ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ ఎం.సుగుణాక‌ర్ రెడ్డి, డాక్టర్ ఎస్‌.డి.శిఖామ‌ణి (వ్యవసాయ శాస్త్రవేత్తలు), దిలీప్ రెడ్డి (పాత్రికేయుడు), లోనావ‌త్ శాంతా బాయి(గిరిజ‌న రైతు), కె.లావ‌ణ్య (సేంద్రియ రైతు) ఇందిరా గాంధీ కృషి ర‌త్న పుర‌స్కారాలు అందుకున్నారు....