భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఖమ్మం పట్టణం పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసిన ఇండ్లను కేటీఆర్ పరిశీలించారు. గురువారం బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చాలా మంది బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఖాళీ చేయించిందని వారు వాపోయారు.

బాధితుల వద్ద ఉన్న అన్ని రకాల ధృవీకరణ పత్రాలను పరిశీలించిన కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన "ఇందిరమ్మ రాజ్యం"లో. ఉన్న ఇళ్లను కూలగొట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు మరియు కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని విమర్శించారు.

ఖమ్మంలో 150 ఇళ్లతో పాటు, మహబూబ్‌నగర్‌లో దివ్యాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం ఈ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శన...