Telangana, సెప్టెంబర్ 20 -- ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపుల విష‌యంలో అవినీతికి పాల్ప‌డితే ఎంత‌టివారినైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏవరైనా పేదలను ఇబ్బంది పెట్టినట్లు తేలితే. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇదే విషయంపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. డ‌బ్బుల కోసం పేద‌ల‌ను వేధిస్తే క్రిమిన‌ల్ కేసుల న‌మోదు చేయాలని ఆదేశించారు.

శుక్రవారం డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సమస్యలు, సందేహాల కోసం గ‌త వారం హౌసింగ్ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన కాల్‌సెంట‌ర్‌కు వ‌చ్చిన ఫిర్యాదుల‌పై మంత్రి పొంగులేటి సమీక్షించారు. కాల్ సెంట‌ర్‌కు ఏ ఏ అంశాల‌పై ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నాను. త‌క్ష‌ణం వాటిపై చ‌ర్య‌లు తీసు...