Telangana,bhadrachalam, ఆగస్టు 18 -- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించిన చాలా మంది. నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. దీంతో గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 21వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం ఉంటుందని ప్రకటించారు.

"ఈ నెల 21 వ తేదీన భద్రాద్రి రాముల వారి సాక్షిగా మరో చారిత్రక ఘట్టం జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలం బెండలంపాడులో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం ఉంటుంది. ఈ గ్రామంలో మొత్తం 312 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో 72 ఇండ్లు పూర్తయ్యాయి. అందులో 27 ఇండ్లకు ము...