భారతదేశం, సెప్టెంబర్ 25 -- ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.1,612.37 కోట్లు పంపిణీ విడుదల అయ్యాయి. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.12 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికే 1.5 లక్షలకు పైగా ఇళ్లకు చెల్లింపులు జరిగాయి. అర్హులైన పేద కుటుంబాలందరికీ శాశ్వత గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలియజేశారు.

గృహ నిర్మాణ దశల ఆధారంగా లబ్ధిదారులకు మొత్తం రూ. 5 లక్షలను విడతలవారీగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వీపీ గౌతమ్ పేర్కొన్నారు. 'లబ్ధిదారుడు క్రెడిట్ చేసిన మొత్తాన్ని అందుకోకపోతే, వారు వారి సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించి ఆధార్ నంబర్‌ను వారి బ్యాంకు ఖాతాతో లింక్ చేయాలి.' అని ఆయన అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 12...