భారతదేశం, నవంబర్ 9 -- దీపావళి పండగ వేళ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం లబ్ధిదారులతో కలిసి ఆదివారం దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని పర్సాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అదే ఇంట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలసి భోజనం చేశారు. లబ్ధిదారుడి కుటుంబ సభ్యులతో ముచ్చటించి, కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

"కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర-శ్రీనివాస్ దంపతులు నూతననంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించాను. కొత్త ఇంట్లో వారికి పట్టు...