భారతదేశం, సెప్టెంబర్ 30 -- తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కానీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా అని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం 42 శాతం రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉంది. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9 నుంచి ఈ ప్రక్రియ మెుదలు అవుతుంది. నామినేషన్ల ప్రక్రియ ఆ రోజు నుంచి షురూ కానుంది. అయితే రిజర్వేషన్ల కోటా 50 శాత దాటడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేసిన అనంతరం.. అక్టోబర్ 8కి వాయిదా వేసింది న్యాయస్థానం. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ మెుదలుకాను...