భారతదేశం, ఏప్రిల్ 2 -- ఇండోనేషియాలో గురువారం ఉదయం మరోసారి భారీ భూకంపం సంభవించింది. మొలుక్కా సముద్ర ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. భూకంపం ధాటికి సముద్రంలో స్వల్ప సునామీ అలలు ఎగసిపడ్డాయి. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) అందించిన వివరాల ప్రకారం.. ఉత్తర మాలుకు ప్రావిన్స్‌లోని టెర్నేట్ నగరానికి పశ్చిమ-వాయువ్య దిశలో దాదాపు 127 కిలోమీటర్ల (79 మైళ్ళు) దూరంలో ఈ భూకంప కేంద్రం ఉంది. భూమి లోపల 35 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు చోటుచేసుకున్నాయి.
భూకంపం సంభవించిన వెంటనే ఇండోనేషియా వాతావరణ, జియోఫిజిక్స్ సంస్థ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితిని నిశితంగా గమనిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.