భారతదేశం, జూన్ 13 -- భారతీయ రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రైలు టికెట్ల బుకింగ్‌లో దశాబ్దాలుగా వేధిస్తున్న సర్వర్ క్రాష్‌లు, పేమెంట్ ఫెయిల్యూర్స్, వెబ్‌సైట్ స్లో అవ్వడం వంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తుంది. 1986 నుండి అమల్లో ఉన్న పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో అత్యాధునిక డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెడుతోంది.

ఈ కొత్త అప్‌గ్రేడ్ ద్వారా ఒకేసారి లక్షలాది మంది ప్రయాణికులు లాగిన్ అయినా సర్వర్లు ఏమాత్రం హ్యాంగ్ అవ్వకుండా, కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్షల టికెట్లు బుక్ చేసుకునేలా రైల్వే శాఖ ఈ మౌలిక వసతులను బలోపేతం చేసింది. పాత సిస్టమ్ నుండి కొత్త సిస్టమ్‌లోకి మారే క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అప్‌గ్రేడ్ ప్రక్రియను అత్యంత సాఫీగా పూర్తి చే...