భారతదేశం, ఆగస్టు 14 -- స్వాతంత్య్ర దినోత్సవం అంటే సంబరాలు, జ్ఞాపకాలు, స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి కడుపునిండా రుచికరమైన వంటలు తినడం. ఈ ఏడాది మన సంబరాలకు, ఆరోగ్యానికి అడ్డు రాని ఐదు అద్భుతమైన స్నాక్స్‌ని అందిస్తున్నాం. శక్తిని కోల్పోకుండా ఉండటానికి స్నాక్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆస్వాదించడానికి, మీ ఉత్సాహాన్ని పెంచడానికి ఈ పోషకాహారంతో నిండిన ఐదు స్నాక్స్ మీకు బాగా ఉపయోగపడతాయి.

మొలకెత్తిన గింజల చాట్ ఒక మంచి పోషకాహారం. ఇందులో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తించే ప్రక్రియ వల్ల గింజల పోషక విలువలు పెరుగుతాయి. దీంతో అవి సులభంగా జీర్ణమవుతాయి. వీటిని టమాటాలు, ఉల్లిపాయలు, చాట్ మసాలాతో కలిపి తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

పోషకాహార నిపుణురాలు ధృతి జైన్ చెప్పిన పోషక విలువలు

పోషకాహారంగానే కాక...