భారతదేశం, నవంబర్ 19 -- హిందువులు ఆ పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. హిందూ సంప్రదాయంలో శివుడికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి దీపారాధన చేయడం, కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండడం.. ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇంట్లో శివలింగం ఉండొచ్చా? పూజించడానికి ఎటువంటి నియమాలను పాటించాలి? శివ పురాణం ఏం చెబుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.

కొంతమంది శివుడి చిత్రపటాన్ని పూజిస్తారు. ఇంకొంతమంది శివలింగాన్ని పెట్టి అభిషేకాలు, అర్చనలు వంటివి చేస్తారు. శివాలయాలకు వెళ్లలేని వారు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని రోజూ పూజించాలని అనుకుంటారు. అయితే ఇంట్లో శివలింగం ఉండొచ్చా? శివలింగం ఉండకూడదని కొంతమ...