భారతదేశం, మే 22 -- సనాతన ధర్మంలో ఆంజనేయస్వామిని సంకట మోచనుడిగా, భయాలను తొలగించి భక్తులను రక్షించే దైవంగా కొలుస్తాం. చాలా మంది తమ ఇంటి పైకప్పుపై హనుమంతుడి జెండాను ఎగురవేస్తుంటారు. ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన వాస్తు మరియు ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇంటి మీద హనుమాన్ ధ్వజం ఉండటం వల్ల ఆ ప్రాంగణంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది, దుష్ట శక్తులు దరిచేరవు.

హనుమాన్ జెండాను ఇంటిపై ప్రతిష్ఠించడం అంటే ఆ స్వామిని మన ఇంటికి ఆహ్వానించినట్టే లెక్క. ఈ జెండా ఎక్కడైతే రెపరెపలాడుతుందో, అక్కడ దుష్ట శక్తులు, కంటి దిష్టి లేదా ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు," అని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు. రామ భక్తుడైన హనుమంతుడి జెండాను పెట్టడం వల్ల అటు శ్రీరాముడి అనుగ్రహం, ఇటు ఆంజనేయుడి రక్షణ రెండూ లభిస్తాయి. ఇది కుటుంబ సభ్యులలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసా...