భారతదేశం, మార్చి 19 -- ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ విడుదలైంది. కాలేజీలు ఫాలో కావాల్సిన ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ఏప్రిల్ 1వ తేదీన పున:ప్రారంభం కానున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ విద్యార్థులకు క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహిస్తారు. అంటే.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరికి క్లాసులు జరుగుతాయి. అనంతరం ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలండర్‌ను విడుదల చేసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....