భారతదేశం, జనవరి 20 -- తెలంగాణలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఆలస్యంగా వచ్చిన వారికి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతిస్తుంది. ఈ మేరకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాయడానికి అనుమతి ఉంటుంది.

గత సంవత్సరం పొడిగించిన ఈ ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ నిబంధన ఈ సంవత్సరం కూడా అమలు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రంలోకి చివరి ప్రవేశ సమయం ఉదయం 9.05 గంటలకు ఉంటుంది. విద్యార్థులు ఉదయం 8.45 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఐపీఈ ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహిస్తారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరంలో మొత్తం 10,47,815 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం ప్...