Telangana,hyderabad, ఆగస్టు 10 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కొనసాగుతోంది.ఇప్పటికే ఫస్ట్, సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విద్యార్థులు.. వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. అయితే వీరికి ఇవాళ (ఆగస్ట్ 10) సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందే విద్యార్థులు ఇవాళ్టి నుంచే ఆన్ లైన్ రిపోర్టింగ్ చేయవచ్చు.

టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ ఫేజ్ కింద సీట్లు పొందిన అభ్యర్థులు... ఆగస్ట్ 10 నుంచే ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ఆగస్టు 12వ తేదీతో పూర్తవుతుంది. కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ కు ఆగస్ట్ 11 నుంచి అవకాశం ఉంటుంది. ఆగస్టు 13వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చ...