Telangana, ఆగస్టు 18 -- రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఈఏపీసెట్ ఫైన్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఇంటర్నల్‌ స్లైడింగ్‌ కు షెడ్యూల్‌ విడుదల చేశారు.

విద్యార్థులు బ్రాంచీలు మారేందుకు ఆగస్ట్ 18, 19వ తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్‌ కు అవకాశం ఉంది. విద్యార్థులు ఈ 2 రోజులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్ట్ 19వ తేదీన వెబ్‌ ఆప్షన్లను ఫ్రీజింగ్ ఉంటుంది. ఆగస్ట్ 22వ తేదీలోపు సీట్లను కేటాయిస్తారు.

టీజీ ఈఏపీసెట్ ఇంటర్నల్ స్లైడింగ్ లో భాగంగా సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్ట్ 22 నుంచి రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇందుకు ఆగస్ట్ 23వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఇప్పటికే ఓ కాలేజీలో చేరిన విద్యార్థులు.. అదే కాలేజీలో మరో బ్రాంచీలో చేరే అవకాశం కూడా ఉ...