ఆ సర్టిఫికెట్లు లేవని నామినేషన్లు తిరస్కరించొద్దు.. ఏపీ స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ
భారతదేశం, అక్టోబర్ 21 -- ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. పోటీ చేసే అభ్యర్థుల నుంచి పోలీసులు ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు(NOC) లేదా వివిధ శాఖల నుంచి పొందే నో డ్యూస్ సర్టిఫికెట్లు లేవనే నెపంతో నామినేషన్లను తిరస్కరించవద్దని ఎన్నికల అధికారులను తీవ్రంగా హెచ్చరించింది.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సర్క్యులర్ జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, అలాగే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు జతచేయాలని రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారని రాజకీయ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.