భారతదేశం, జూన్ 15 -- Karan Johar Review On Raakh OTT Streaming Series: ఇటీవల ఓటీటీ వేదికలపై యథార్థ క్రైమ్ స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఎక్కువే ఉంటుంది. అయితే, కొన్ని కథలు కేవలం వినోదాన్ని మాత్రమే ఇవ్వవు.. గుండెలను పిండేస్తాయి, సమాజంలోని చీకటి కోణాన్ని చూపిస్తూ భయాందోళనలకు గురిచేస్తాయి.

సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త సిరీస్ 'రాఖ్' (Raakh). మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ చూసిన ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అర్ధరాత్రి వేళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకున్న తన నిర్ణయాన్ని పక్కనబెట్టి మరీ ఈ సిరీస్ గురించి సుదీర్ఘ పోస్ట్ పెట్టారు కరణ్ జోహార్. దేశ రాజధాని ఢిల్లీలో 1978లో జరిగిన గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు త...