భారతదేశం, జనవరి 4 -- టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన 'శంబాల' చిత్రం ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు.

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన శంబాల డిసెంబర్ 25న విడుదలై మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శంబాల విజయోత్సవ వేడుక డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజేష్ దండా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

రాజేష్ దండా మాట్లాడుతూ .. "శంబాల లాంటి మంచి సినిమాను మీడియానే జనాల వరకు తీసుకెళ్లింది. చిన్న చిత్రాల్ని చూసేందుకు థియేటర్లకు రావడం లేదు అనే మాటల్ని ఎడమ కాలితో తిప్పి కొట్టింది 'శంబాల'. ప్రివ్యూలో ఈ మూవీని చూసి హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్‌లో ఏదో ఒకటి అవుతుందని చెప్పాను" అని ...