భారతదేశం, మార్చి 4 -- భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రేయా ఘోషల్.. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్, తను ఎంచుకునే పాటల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా లేదా అసభ్యకరంగా ఉండే సాహిత్యం పట్ల తానూ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు ఆమె తెలిపింది. అయితే గతంలో ఆమె పాడిన చిక్నీ చమేలీ సాంగ్, దానిని ఇప్పటికీ పలు కాన్సర్ట్ లలో పాడుతుండటంపై విమర్శలు వస్తున్నాయి.

రాజ్ శమని పాడ్‌కాస్ట్‌లో శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. 'చిక్నీ చమేలీ' వంటి హిట్స్ తర్వాత తనకు అలాంటి తరహా పాటలే చాలా వచ్చాయని, కానీ వాటిని తాను తిరస్కరించానని చెప్పింది. "ఒకసారి నా స్నేహితుడైన కంపోజర్ ఒక పాట ఆఫర్ చేశారు. అందులో సాహిత్యం ఎంత అసభ్యంగా ఉందంటే.. ఆ పదాలను తలచుకుంటేనే నాకు సిగ్గు అనిపించింది. అందుకే ఆ పాటను పా...