భారతదేశం, అక్టోబర్ 5 -- మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న కారణఁగా 11 మంది చిన్నారులను మరణించిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అప్రమత్తమైంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ కలుషితం ఉన్న SR-13 బ్యాచ్ సిరప్‌ను ఉపయోగించకూడదని హెచ్చరించింది.

కోల్డ్‌రిఫ్ సిరప్ (బ్యాచ్ నం. SR-13) వాడకాన్ని ప్రజలు ఆపేయాలని డీసీఏ నోటీసు ఇచ్చింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో శ్రేసన్ ఫార్మా తయారు చేసిన ఈ సిరప్‌లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరణానికి కారణమయ్యే విషపూరిత రసాయనమైన డైథిలిన్ గ్లైకాల్ (DEG) కల్తీ ఉన్నట్లు డీసీఏ తెలిపింది.

ప్రజలు వెంటనే ఈ సిరప్ వాడకాన్ని నిలిపివేయాలని, ఏదైనా సిరప్ కలిగి ఉంటే స్థానిక డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు నివేదించాలని సూచించింది. పౌరులు ఉదయం 10:30 ను...