భారతదేశం, డిసెంబర్ 14 -- బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం.. పార్టీ కేంద్ర కార్యాలయం, తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుంది. ​ఈ సమావేశం సందర్భంగా.. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైన, తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మీద చర్చ జరుగుతుంది.

గోదావరి, కృష్ణా జలాలను ఏపీ కొల్లగొడుతున్నా కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ చెబుతోంది. తెలంగాణ ప్రజల, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని ఆ పార్టీ భావిస్తోంది. ​ఇందులో భాగంగా తదుపరి కార్యాచరణపై సమావేశంలో లోతుగా చర్చించనున్నారు కేసీఆర్....