భారతదేశం, డిసెంబర్ 22 -- విద్యుత్ శాఖ ఉద్యోగులకు 17 శాతానికిపైగా కరువు భత్యం(DA) లభిస్తుందని, దీని వలన 71,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ అధికారులు తయారుచేసిన ప్రతిపాదనలను ఆధారంగా ఆమోదం తెలిపినట్టుగా భట్టి విక్రమార్క వెల్లడించారు.

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే జీవన వ్యయ సర్దుబాటు భత్యమే డీఏ. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా చేసుకుని ప్రతి ఏటా జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్(డీఏ)/డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్)ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు డీఏను 17.651 శాతంగా నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. 1/7/2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు,...