భారతదేశం, సెప్టెంబర్ 15 -- తెలంగాణ రాష్ట్రంలో వీధి దీపాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద పెద్ద కంపెనీల నుంచి టెండర్లు పిలవాలని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్‌ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీధి దీపాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చెప్పారు.

వీధి దీపాలకు సోలార్ పవన్ ఉపయోగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని చెప్పారు. తెలంగాణలోని అన్ని వీధి దిపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ద్వారా అనుసుంధానం చేయాలన్నారు. 'ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలి. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణనను గ్రామ పంచాయతీకి అప్పగించాలి...