భారతదేశం, అక్టోబర్ 30 -- ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఆస్తి వ్యామోహానికి, సవతి తల్లి కక్షసాధింపునకు ఇద్దరు చిన్నారులు బలైపోయారు. ఎంతో ఇష్టంగా తింటారనే నెపంతో, చికెన్ బిర్యానీలో ఎలుకల మందు కలిపి ఇచ్చి, నమ్మించి గొంతు కోసింది ఆ కిరాతకురాలు. కలుషిత ఆహారం తిని చనిపోయారంటూ నిందితులు అల్లిన కల్లబొల్లి కథలను ఛేదించి, కొత్తపేట పోలీసులు అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు.

పోలీసు వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరుకు చెందిన స్వర్ణ, నెహ్రూనగర్ నివాసి రాంబాబులు 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సాత్విక్ (10), నిత్య (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగా 2022లో స్వర్ణ ఆత్మహత్య చేసుకుంది. రాంబాబు మేరీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకోవడంతో చిన్నారుల జీవితాల్లోకి పెద్ద తుపాను వచ్చిపడింది. తల్లి లేని లోటు తెలిసి...