భారతదేశం, జూలై 2 -- నిజ జ్యేష్ఠ మాసం మరి కొన్ని రోజుల్లో పూర్తికాబోతోంది. ఈ నెల పూర్తయిన తర్వాత ఆషాఢ మాసం మొదలవుతుంది. హిందూ మతంలో ఆషాఢ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో గ్రహాల మార్పులు కూడా జరగబోతున్నాయి. జూలై 14న ఆషాఢ మాసం ప్రారంభం కానుండగా, ఐదు రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఏ రాశి వారి అదృష్టం పెరగబోతోంది? ఏ రాశుల వారు ఆషాఢ మాసంలో విపరీతంగా లాభాలను పొందుతారు? మరి అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

మేష రాశి వారికి ఆషాఢ మాసం శుభప్రదంగా ఉంది. ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతోంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. ఈ రాశి వారు వృత్తిలో పురోగతిని పొందుతారు. ఉద్యోగులు మంచి అవకాశాలను పొందుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు కూడా మీ పనిని గుర్తించి కొత్త ...