భారతదేశం, సెప్టెంబర్ 13 -- జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా భావించే దేవగురువు బృహస్పతి తన కదలికలను మారుస్తూ ఎప్పటికప్పుడు అన్ని రాశుల వారి జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంటాడు. ప్రస్తుతం బృహస్పతి గ్రహం బుధుడు అధిపతిగా వ్యవహరించే ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఆస్ట్రో పండితుల గణాంకాల ప్రకారం. అక్టోబర్ 31, 2026 వరకు గురువు ఈ నక్షత్రంలోనే కొనసాగుతాడు.

బుధుడి నక్షత్రంలో గురువు ప్రవేశించడం వల్ల ఈ రెండు గ్రహాల సంయుక్త అనుగ్రహం కొన్ని రాశుల వారికి విశేషంగా లభించనుంది. ముఖ్యంగా రాబోయే 48 రోజుల పాటు ఈ నక్షత్ర మార్పు వల్ల ఏడు రాశుల వారిపై లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఉంటాయని, వారికి ఊహించని ధన వర్షం కురుస్తుందని ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. ఆ అదృష్ట రాశులు ఏవో, వారి జాతకాల్లో ఎలాంటి సానుకూల మార్పులు రాను...