భారతదేశం, ఆగస్టు 28 -- హైదరాబాద్: సమాజంలో వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో పనిచేస్తున్నాయి. అయితే, వారికి అవసరమైన వైద్యం వారి ఇంటి వద్దకే చేర్చేందుకు ఆశ్రయ ఆకృతి అనే స్వచ్ఛంద సంస్థ ఒక విప్లవాత్మకమైన అడుగు వేసింది. ఆరోగ్య రంగంలో సేవలు అందిస్తున్న ఆప్టమ్ ఇండియా సంస్థ సహకారంతో ఆశ్రయ ఆకృతి స్వచ్ఛంద సంస్థ మొబైల్ హియరింగ్ క్లినిక్‌ను ప్రారంభించింది. అన్ని అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ క్లినిక్, హైదరాబాద్‌లోని వెనుకబడిన వర్గాల గడప వద్దకే వెళ్లి చెవి, ముక్కు, గొంతు (ENT) సంబంధిత వైద్య సేవలను అందించనుంది.

ఈ మొబైల్ క్లినిక్ ద్వారా ఆధునిక వైద్య పరికరాలు, వినికిడి పరీక్షలు, ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించడం, సరైన సమయంలో చికిత్స అందించడం వంటి కీలక సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ వినూత్న కార్యక్రమం వినికిడి సమస్య...