భారతదేశం, అక్టోబర్ 8 -- ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. 2023 ఫిబ్రవరి తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరింది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన వైఖరిని 'న్యూట్రల్' నుంచి 'కాలిక్యులేటెడ్ టైటెనింగ్'కి మార్చింది. ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో మరో విడత వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చని లేదా కొంతకాలం విరామం ఇవ్వవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ నిర్ణయం రుణ గ్రహీతలపై భారం మోపనుండగా, పొదుపుదారులకు మాత్రం తీపి కబురు అందించనుంది.

రెపో రేటు పెంపు ప్రకటించిన వెంటనే పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు తమ బెంచ్‌మార...