భారతదేశం, ఏప్రిల్ 1 -- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్రవ్య పరపతి సమీక్ష (MPC) సమావేశంలో కీలక వడ్డీ రేట్లను మార్చే అవకాశం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఒక తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగిస్తూనే, తన 'తటస్థ' (Neutral) వైఖరిని ఆర్బీఐ అలాగే ఉంచవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది.
సాధారణంగా ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీలను తగ్గిస్తాయి. దీనివల్ల హోమ్ లోన్లు, కార్ లోన్లు తీసుకున్న మధ్యతరగతి ప్రజల ఈఎంఐలు తగ్గుతాయి. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా ఈసారి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్లేషించింది.
గత ఫిబ్రవరిలో ఆర్బీఐ తన పరపతి విధానాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచ పరిస్థితుల్లో పెను మార్పులు వచ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.