భారతదేశం, సెప్టెంబర్ 21 -- చైనీస్ వాస్తు శాస్త్రమైన ఫెంగ్ షుయ్‌లో మన జీవితాన్ని మార్చే శక్తి ఉన్న అనేక అద్భుతమైన వస్తువులు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేది 'ఫెంగ్ షుయ్ కప్ప'. దీనిని అక్షరాలా ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంగా భావిస్తారు. సాధారణ కప్పలకు భిన్నంగా, ఫెంగ్ షుయ్ కప్పకు కేవలం మూడు కాళ్లు మాత్రమే ఉండటం దీని ప్రత్యేకత. ఇంటా బయటా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తూ, ఆర్థిక అభివృద్ధిని చేకూర్చే ఈ అద్భుతమైన వస్తువును ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచేటప్పుడు కొన్ని కఠినమైన నియమాలను పాటించాలి. లేదంటే ఆశించిన ఫలితాలు దక్కవు.

నియమాల ప్రకారం, ఈ మూడు కాళ్ల కప్పను ఇంటి ప్రధాన ద్వారానికి సమీపంలో ఉంచడం మంచిది. అయితే, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కప్ప ముఖం ఎప్పుడూ ఇంటి లోపలి వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే సంపద ఇంట్లోకి ప్రవహిస్తుంద...