భారతదేశం, ఏప్రిల్ 24 -- టీజీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం తన పరిధిలోని అన్ని విద్యాసంస్థలలో పరీక్షలను రెండు రోజుల పాటు వాయిదా వేసింది. రవాణా సేవలకు అంతరాయం కలగడం వల్ల విద్యార్థులు, సిబ్బందికి అసౌకర్యం కలుగుతుందని పేర్కొంటూ అధికారులు శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షల సవరించిన షెడ్యూల్ను త్వరలో విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది.
నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ మృతి నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్లు వరంగల్ బంద్కు పిలుపునిచ్చాయి. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ తరలించిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. శంకర్ గౌడ్ మరణించారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.