భారతదేశం, సెప్టెంబర్ 28 -- మూసీ నది ఉప్పొంగి ప్రవహించడంతో వరదలు వచ్చాయి. దీంతో గౌలిగూడలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్(ఎంజీబీఎస్)లోనూ నీరు చేరింది. దీంతో బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఆదివారం బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత రాత్రి ఆలస్యంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఆదివారం ఉదయం నుంచి బస్టాండ్ ఆవరణలో శుభ్రపరచడం, పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టారు. దీనివల్ల ఆర్టీసీ సేవలను పునఃప్రారంభించడానికి వీలు కలిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చూసిన ప్రయాణికులు సాధారణ స్థితికి చేరుకోవడంతో బస్సులు ఎక్కగలిగారు.

ప్రతీరోజూ నడిచే బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు బస్సు నడుస్తాయని...