భారతదేశం, జనవరి 20 -- జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రూ.27.68 కోట్లతో అత్యధిక ఆదాయాన్ని సంపాదించింది. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే అత్యధికం. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడం ద్వారా, ప్రయాణికుల నుండి మంచి ఆదరణతో ఈ రికార్డు పనితీరుని క్రియేట్ చేసింది. జనవరి 19న రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 50.6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.

సంక్రాంతి తర్వాత రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంటికి తిరిగి వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. డిమాండ్ పెరుగుదలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రత్యేక బస్సులను నడిపింది. వైజాగ్ నుంచి కూడా చాలా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపారు అధికారులు. ఈ సేవలను సాధారణ ఛార్జీలతో నడపడం ద్వారా ఏపీఎస్ఆర్టీ...