భారతదేశం, ఏప్రిల్ 25 -- తెలంగాణలో కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తాజాగా ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారులతో కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో రోడ్లపై బస్సులు నడుస్తున్నాయి.

ఈ చర్చల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరాలను వెల్లడించారు.

ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్‌సీ ప్రకటించింది ప్రభుత్వం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై అధ్యయనం...