భారతదేశం, మార్చి 6 -- ఐటీ రంగంలో 'లేఆఫ్స్' భయం మళ్లీ మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తృతి పెరుగుతున్న కొద్దీ, మానవ వనరుల అవసరం తగ్గుతోందా అన్న ఆందోళనలు నిజమవుతున్నాయి. గత ఏడాది 1.20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా, ఆ పరంపర 2026లోనూ కొనసాగుతోంది. కేవలం ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే సుమారు 50 కంపెనీలు 35,000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించాయని 'Layoffs.fyi' గణాంకాలు చెబుతున్నాయి.

టెక్ రంగంలోని అగ్రగామి సంస్థలు సైతం AI కోసం భారీగా వెచ్చిస్తూ, మరోవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఆ జాబితాలో ప్రధానంగా:

AI సామర్థ్యంపై టెక్ కంపెనీల సీఈఓలు చేస్తున్న వ్యాఖ్యలు ఉద్యోగులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మనుషుల కంటే కొన్ని రంగాల్లో టెక్నాలజీయే వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.

"మా ఏఐ ఏజెంట్ ఇప్పుడు ...