భారతదేశం, జూలై 27 -- ఆర్ఆర్‌బీ 6238 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2025 ఆగస్టు 7 వరకు పొడిగించింది. మొదటి దరఖాస్తుకు చివరి తేదీ జూలై 28. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు www.rrbapply.gov.in కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్- 183 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు 6055 ఉన్నాయి.

పోస్టు ఆధారంగా విద్యార్హతలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నవారికి వయోసడలింపు కూడా ఉంటుంది.

టెక్నీషియన్ గ్రేడ్ I ప్రారంభవేతనం రూ.29200, టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టులకు ప్రారంభ వేతనం రూ.19900.

దరఖాస్తుదారుల...