భారతదేశం, మే 21 -- తెలంగాణ రాష్ట్ర రవాణా రంగాన్ని మలుపు తిప్పే రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న ఐదు ప్యాకేజీల విధానాన్ని సవరించి, ఈసారి కేవలం రెండు ప్యాకేజీలతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సరికొత్త టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ఈ ప్రతిష్టాత్మక 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును దాదాపు రూ. 9,362.4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.

సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్‌పల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర ఈ ఉత్తర భాగం విస్తరించనుంది. ఈ రహదారిని 'NH-161AA' గా నోటిఫై చేశారు. పనులను వేగవంతం చేసేందుకు NHAI దీనిని రెండు ప్రధాన ప్యాకేజీలుగా విభజించింది....