భారతదేశం, సెప్టెంబర్ 23 -- రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), ఇతర జాతీయ రహదారులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూమి కోల్పోయిన రైతులకు పరిహారం త్వరితగతిన చెల్లించాలన్నారు. కోర్టులలో పెండింగ్‌లో ఉన్న వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ప్రాజెక్టుకు అనుసంధానించిన రేడియల్ రోడ్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలను రెండు వేర్వేరు ప్రాజెక్టులుగా చూడొద్దని ఎన్‌హెచ్ఏఐ అధికారులతో రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తర భాగానికి కేటాయించిన నంబరునే దక్షిణ భాగానికి కూడా కొనసాగించాలన్నారు. వెంటనే అనుమతులు మంజూరు చేయాలని, ఏకకాలంలో రెండింటి పనులు ప్రారంభించడానికి సహకరిం...