భారతదేశం, జూలై 12 -- సమాజాన్ని నివ్వెరపరిచే అత్యంత అమానుషమైన, గుండెల్ని పిండేసే విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవలగూడ గ్రామంలో జరిగింది. ఒకే ఒక్క ఉన్మాద ఆలోచన.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. తన భార్య, ఇద్దరు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురిని కిరాతకంగా హతమార్చాడు పి.రాజ్‌కుమార్ అనే వ్యక్తి. ఈ దారుణానికి పాల్పడటానికి కొన్ని గంటల ముందు.. తన ఇద్దరు కొడుకులను హెయిర్‌కట్ కోసం బయటకు తీసుకెళ్లాడు. చంపడానికి కొన్ని గంటల ముందు కుమారులతో ఎంతో సరదాగా క్రికెట్ ఆడాడని స్థానికులు చెబుతూ.. కన్నీరుమున్నీరవుతున్నారు.

మే నెలలో 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించినందుకు గాను రాజ్‌కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. ఆ కేసు పెట్టిన కుటుంబంపై పగ పెంచుకున్నాడు. జూలై 10 (శుక్రవారం) రాత్రి 1...