భారతదేశం, అక్టోబర్ 31 -- మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల మరోసారి జంటగా నటించిన సినిమా మాస్ జాతర. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా వచ్చిన మాస్ జాతరను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇవాళ అంటే అక్టోబర్ 31న థియేటర్లలో మాస్ జాతర సినిమా విడుదలైంది. అయితే, మాస్ జాతర రిలీజ్‌కు ముందు మీడియాతో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ భాను భోగవరపు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

-రవితేజ గారి ఐకానిక్ మూమెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రిఫరెన్స్‌లు పెట్టడం జరిగింది. అలా అని అవి కథకి అడ్డుగా ఉండవు. అభిమానులు సెలబ్రేట్ చేసుకున...