భారతదేశం, జూన్ 19 -- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకుపోయిన 110 మంది భారతీయులను భారత్ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. ఆపరేషన్ సింధు కింద ఈ భారతీయ విద్యార్థులతో కూడిన మొదటి విమానం ఆర్మేనియాలోని యెరెవాన్ నుంచి న్యూఢిల్లీకి చేరుకుంది. భారత రాయబార కార్యాలయం సహకారంతో టెహ్రాన్ లో నివసిస్తున్న విద్యార్థులను సురక్షితంగా తరలించినట్లు విదేశాంగ శాఖ ధృవీకరించింది.

భారత రాయబార కార్యాలయం సహాయంతో టెహ్రాన్ లోని భారతీయ విద్యార్థులను నగరం నుంచి తరలించినట్లు విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. భారతీయ విద్యార్థులు జూన్ 18న యెరెవాన్ లోని జ్వార్ట్ నట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ విమానం జూన్ 19 ఉదయం న్యూఢిల్లీలో ల్యాండ్ అయింది. ఇరాన్ లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకొచ్చేంద...